మహానాడు మీడియా తాజా వార్తలు
Mahanadu Media Digital Desk
11:49 AM (IST)
25 Aug, 2026
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
- గత కొద్ది రోజులగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి (Gold and Silver Rates).
- గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,63,750గా ఉంది.
- నిన్నటితో పోల్చుకుంటే రూ.220 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,50,100గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.200 మేర తగ్గింది (Live Gold Rates).
03:56 PM (IST)
19 Aug, 2026
కూలిన బంగారం గని.. 30 మంది దుర్మరణం
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో మంగళవారం ఓ బంగారం గని కూలిపోవడంతో 30 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
- ఇప్పటికీ గనిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు