నేటి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుపై రయ్.. రయ్
- రెండు స్టీల్ బ్రిడ్జీలు సహా సవాళ్లను ఎదుర్కొని పూర్తయిన నిర్మాణం
-
నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం
-
ఆ వెంటనే ప్రజాప్రతినిధుల క్వార్టర్స్‌కు శ్రీకారం
-
గురువారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనున్న రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్
-
1. బకింగ్ హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జి
-
2. కొండవీటి వాగుపై స్టీల్ బ్రిడ్జి 3. సీడ్ యాక్సెస్ రోడ్
-
ప్రజాప్రతినిధుల కోసం.. ప్రారంభానికి సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయం
రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది! అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకుని అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను సీఎం అందుకుంటారు. ఆ భవనాలను జీఏడీ పరం చేస్తారు. అలాగే రెండు స్టీల్ బ్రిడ్జిలనూ ప్రారంభిస్తారు. ఇలా.. ఒకే రోజు మూడు కీలక ఘట్టాలు ఆవిష్కృతం అవుతుండటం, ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో సందడి నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానంలో భాగంగా నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం మంత్రి నారాయణ పరిశీలించారు. 110 మీటర్ల పొడవుతో బకింగ్‌హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు చానల్‌పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. ఉండవల్లి నుంచి నేరుగా అమరావతికి కనెక్టివిటీ రావడంతో మంగళగిరి, విజయవాడ ప్రజలు నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించవచ్చని నారాయణ తెలిపారు. అమరావతికి స్వాగతం పలుకుతూ, స్టీల్ బ్రిడ్జి వద్ద ఏ...ఆకారంలో పైలాన్ ఏర్పాటు చేశారు.