ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
02:11 pm Aug 15, 2026

అమరావతి, ఆగస్టు 15: ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈఏడాది తొలిసారిగా రాష్ట్ర రాజధాని అమరావతిలో జాతీయ జెండా వేడుకలను నిర్వహించారు. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేశారు.

  • ఏపీ అసెంబ్లీలో 80వ స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ​జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ ​కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, ఎమ్మెల్యే యార్లగడ్డ, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ తదితరులు పాల్గొన్నారు. ​జాతీయోద్యమ నాయకులు, రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులకు స్పీకర్ ఘన నివాళులర్పించారు. ​మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. ​ఏపీ శాసనసభ ఐదు కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

    Advertisement
  • చిత్తూరు జిల్లాలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు చిత్తూరు గురుజాల జగన్మోహన్, పూతలపట్టు మురళీమోహన్, చూడ చైర్మన్ కటారి హేమలత, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డుడి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పాల్గొన్నారు.

  • కడప జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌం‌‌డ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి.. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడితో కలిసి ప్రత్యేక వాహనం ద్వారా పరేడ్‌ను కొల్లు రవీంద్ర పరిశీలించారు. అనంతరం వేదికపై నుంచి జిల్లా ప్రగతిని వివరించారు.

  • అనకాపల్లి జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం మైదానంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని అనిత అన్నారు. అనకాపల్లి కేవలం జిల్లా కాదు.. పోరాటాల గడ్డగా అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి.. గురజాడ అప్పారావు సామాజిక చైతన్యం అనకాపల్లి గడ్డ ప్రత్యేకత అని అనిత పేర్కొన్నారు.

  • నంద్యాల జిల్లాలోని పి.ఎస్.సి & కె.వి.ఎస్.సి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వేడుకల్లో పాల్గొన్నారు.

  • నెల్లూరు జిల్లాలోని పోలీసు పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మంత్రి నారాయణ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఆపై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదిక, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలనను నారాయణ వివరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజిత వేజెండ్ల పాల్గొన్నారు.

  •  
Advertisement
Advertisement