కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!
11:03 am Oct 12, 2026

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేసే ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత ఈ దాడి జరిగింది. ఖార్కివ్ విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత కాల్పుల విరమణపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి (Kharkiv Power Plant Attack)

Advertisement
Advertisement
Advertisement