రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు
10:11 am Aug 25, 2026
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయవ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది మంగళవారానికి ఒడిశాలోని మారుమూల ప్రాంతాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా సతివాడలో 4.95, అనంతపురంలో 3.62, బొబ్బిలిలో 3.25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మంగళవారం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని సూచించింది.