బ్రిటిష్‌ చెస్‌లో భారత సంతతి ఆటగాళ్ల హవా
02:46 pm Aug 12, 2026

లండన్‌: ఈ సీజన్‌ బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్లు అదరగొట్టారు. ఈ టోర్నీ మహిళల విభాగంలో విజేతగా నిలిచిన 11 ఏళ్ల బోధనా శివానందన్‌.. పిన్న వయసులోనే మహిళా చెస్‌ చాంపియన్‌గా అవతరించిన బ్రిటన్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. బోధన ప్లేఆ్‌ఫ్సలో ఐర్లాండ్‌కు చెందిన 14 ఏళ్ల త్రిషా కన్యామరాలను ఓడించి టైటిల్‌ అందుకుంది. ఇక, ఇదే టోర్నీ ఓపెన్‌ విభాగంలో భారత సంతతి ఆటగాడైన శ్రేయాస్‌ రాయల్‌ చాంపియన్‌గా నిలవడం విశేషం. 17 ఏళ్ల శ్రేయాస్‌ మొత్తం 9 రౌండ్లకుగాను టాప్‌లో నిలిచి ట్రోఫీ దక్కించుకున్నాడు. 122 ఏళ్ల బ్రిటన్‌ చెస్‌ చరిత్రలోనే అతిపెద్ద టోర్నీగా పిలుచుకొనే ఈ చాంపియన్‌షి్‌పలోని రెండు విభాగాల టైటిళ్లనూ భారత సంతతి ఆటగాళ్లే కొల్లగొట్టడం విశేషం.

 

Advertisement
Advertisement
Advertisement