సీఎం సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్
02:44 pm Aug 12, 2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ సీహెచ్.భద్రయ్య (Bhadrayya) ప్రెసిడెంట్ పోలీసు మెడల్ (President Police Medal) సాధించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీసు మెడల్‌ను భద్రయ్యకు ప్రధానం చేయనున్నారు. 35 ఏళ్లకు పైగా పోలీసు సేవలో వివిధ హోదాల్లో పనిచేస్తూ.. ప్రస్తుతం ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ/కమాండెంట్‌గా భద్రయ్య కొనసాగుతున్నారు.

వీవీఐపీల భద్రతా విభాగంలో ఆయన పనిచేస్తున్నారు. గతంలో ఇండియన్ పోలీస్ మెడల్‌ను భద్రయ్య సాధించిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ఇచ్చే ప్రెసిడెంట్ పోలీసు మెడల్ రావడంపై భద్రయ్యకు పలువురు అధికారులు అభినందనలు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement