డేవిస్ కప్ జట్టులో మానస్‌కు చోటు
02:49 pm Aug 12, 2026
న్యూఢిల్లీ: డేవిస్ కప్‌లో తలపడే భారత టెన్నిస్ జట్టులో మానస్ ధమ్నేకు తొలిసారి చోటు దక్కింది. వచ్చే నెల 18,19న దక్షిణ కొరియాతో క్వాలిఫయర్ రౌండ్ 2లో భారత్ తలపడనుంది. సుమిత్ నగాల్, దక్షిణేశ్వర్ సురేశ్‌లతో కూడిన సింగిల్స్ విభాగంలో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల మానస్ చోటు దక్కించుకున్నాడు. యుకీ భాంబ్రి-శ్రీరామ్ బాలాజీ డబుల్స్‌లో తలపడనున్నారు.