మనమ్మాయిల ఆట అంతంతే..
మరో మూడు రోజుల్లో మహిళల హాకీ ప్రపంచ కప్‌నకు తెరలేవనుంది. బెల్జియం, ఆమ్‌స్టెల్‌వీన్ వేదికలుగా పురుషులు, మహిళల మెగా టోర్నమెంట్ జరగనుంది. ఈనేపథ్యంలో ప్రతిష్ఠాత్మక వరల్డ్ కప్‌లో భారత మహిళల ప్రస్థానాన్ని గమనిస్తే..మన ప్రదర్శన అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. 1974 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ప్రపంచ కప్ జరిగితే భారత మహిళలు ఎనిమిదిసార్లే టోర్నమెంట్‌కు అర్హత సాధించారు. 1974 తొలి వరల్డ్ కప్‌లో నాలుగో స్థానమే మెగా టోర్నీలో ఇప్పటిదాకా మన అత్యుత్తమ ప్రదర్శన కావడం గమనార్హం.
1974, ఫ్రాన్స్
అజిందర్ కౌర్ కెప్టెన్సీలో తలపడిన భారత మహిళలు తొలి వరల్డ్ కప్‌ను చిరస్మరణీయం చేసుకున్నారు. ఆ ఏడాది చాంపియన్ నెదర్లాండ్స్‌ను గ్రూప్ దశలో ఓడించి సంచలనం సృష్టించారు. మెక్సికో, స్పెయిన్‌పై గెలిచి గ్రూప్ టాపర్‌గా నిలిచారు. సెమీఫైనల్లో 0-1తో అర్జెంటీనా చేతిలో ఓడిన మనోళ్లు..కాంస్య పతక పోరులో జర్మనీపై 0-2తో పరాజయం చవిచూశారు.
మహిళల హాకీ ప్రపంచ కప్ 3 రోజుల్లో
1976, బెర్లిన్: మహిళల హాకీ సంఘం వద్ద నిధుల కొరత, స్పాన్సర్‌షిప్ కూడా లేకపోవడంతో జట్టు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనలేకపోయింది.
1978, మాడ్రిడ్: రూపా సైనీ సారథ్యంలో బరిలో దిగిన భారత జట్టు 10 జట్లలో ఏడో స్థానంతో టోర్నమెంట్‌ను ముగించింది.