వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు
02:58 pm Aug 12, 2026

గూడూరు పట్టణా నికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలులో కేడీసీసీబీ చైర్మన్‌ ఎదురూరు విష్ణువర్ధన రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సమక్షంలో దాదాపు వందమంది టీడీపీలో చేరారు. వీరికి వారు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన శ్రీనివాస్‌ యాదవ్‌, శంకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. టీడీపీలో చేరిన వారిలో నర్సప్ప, శేఖర్‌, భూషణం, గిడ్డయ్య, నారాయణ, వెంకటేశ్వర్లు, వంశీ, నరేంద్ర, శ్రీరాములు, కుశలన్న, భాస్కర్‌, లింగన్న, దస్తగిరి, బుదయ్య, చిన్నకొండల్‌, రఘు, అర్జున్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement